|
|
by Suryaa Desk | Sun, Dec 10, 2023, 11:35 AM
సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో యశోదా ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్నారు. మంత్రులతో కలిసి ఆస్పత్రికి రేవంత్ ఆస్పత్రికి చేరుకుని కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోనున్నారు. కాగా కేసీఆర్ కు రెండు రోజుల క్రితం హిప్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆస్పత్రికి చేరుకున్నారు.
మరోవైపు శనివారం సాయంత్రం యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఆయనను వైద్య బృందం పర్యవేక్షిస్తోందన్నారు. బెడ్ మీద నుంచి లేచి నడవగలుగుతున్నారని, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ డాక్టర్ల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారని హెల్త్ బులిటెన్ లో తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నామని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.