|
|
by Suryaa Desk | Sun, Dec 10, 2023, 12:05 PM
రైతుబంధుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. "హరీశ్ రావు రైతుబంధు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చి వారం రోజులే అవుతోంది. మేము వాళ్లపై విమర్శలు చేయం.. మొదట పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం." అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రోడ్లు-భవనాల శాఖ, సినిమాటోగ్రఫి శాఖ మంత్రిగా కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో పండితుల ఆశీర్వచనాల అనంతరం బాధ్యతలు చేపట్టారు. నిన్న తెలంగాణ ప్రజలకు పండగరోజని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని.. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల కోసం సోనియమ్మ 6 గ్యారంటీలను ఇచ్చారని.. ఇవాళ 2 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని అన్నారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు.