by Suryaa Desk | Sun, Aug 11, 2024, 06:18 PM
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామానికి చెందిన జంగ నర్సింహ జూలై 24న జూరాల గ్రామం నుంచి కతెపల్లికు తన మోటార్ సైకిల్ పై వెళుతుండగా తన మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. వెంటనే ఆత్మకూరు పోలీస్టేషన్ లో దరఖాస్తు చేశారు. ఆత్మకూరు పోలీసులు సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా బాధితుని ఫోన్ ను సింగంపేట గ్రామంలో ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆదివారం బాధితుడికి పోగొట్టుకున్న ఫోను తిరిగి అందజేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.