![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 12:37 PM
స్వాతంత్య్రం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈనెల 23న సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సీపీఎం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ తెలిపారు. ఖమ్మం సుందరయ్య భవనంలో గురువారం జరిగిన పార్టీ టూటౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు బోడపట్ల సుదర్శన్, నర్రా రమేష్, భూక్యా ఉపేందర్ పాల్గొన్నారు.