![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 12:49 PM
రోడ్డు ప్రమాదం లో 13 మందికి గాయలైన ఘటన యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం స్టేజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుందివివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి రెండు ప్రైవేటు బస్సులు బలంగా ఢీకొట్టాయి. ఈ దుర్ఘటనలో రెండు బస్సుల్లో ఉన్న 13 మందికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రి (Choutuppal Area Hospital)కి తరలించారు. అరెంజ్ ట్రావెల్స్ (Orange Travels) బస్సులో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా అతడిని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.