![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 08:59 PM
రాష్ట్రంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న ముదిరాజ్‌ల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రణాళికతో ముందడుగు వేద్దామని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పిలుపునిచ్చా రు. హైదర్‌గూడలోని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నాడు లాల్ దర్వాజ ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. దీనికి బండ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బండ ప్రకాశ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల సామాజిక, ఆర్ధిక స్థితిగతులను అర్థం చేసుకుని అన్ని రంగాల్లో ముది రాజ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ముదిరాజ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. త్వరలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి లాల్ దర్వాజా ప్రాంతంలోని ముదిరాజ్ ల సమస్యలపై చర్చిచేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో లాల్ దర్వాజా ముదిరాజ్ నేతలు విజయ్ కుమార్, జగదీశ్, సుధాకర్, ధర్మవీర్, సదా, అనిల్ కుమార్, సురేందర్, సతీశ్, కైలాశ్, నవీన్, పోసాని అశ్విన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.