![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 11:09 AM
ఖాజాగూడలోని కొత్త కుంట(నానక్ రామ్ కుంట)ను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మంగళవారం పరిశీలించారు.కొత్త కుంట ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయనిఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని కమిషనర్ పరిశీలించారు. యిదే విషయమై ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డి కూడా హైడ్రా కు ఫిర్యాదు చేశారు. వంశీరామ్ బిల్డర్స్ తో మాట్లాడి చెరువులో వేసిన మట్టిని మూడు నాలుగు రోజుల్లో తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధి తెలుసుకునేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలన్నారు.చెరువులో పోసిన మట్టిని రెండు మూడు రోజుల్లో తొలగిస్తామని యీ సందర్భంగా వంశీరం బిల్డర్స్ కమిషనర్ కు హామీ యిచ్చారు.