ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 01:07 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ చౌరస్తాలో గల అశ్వారుడ మహాత్మా బసవేశ్వరుడి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి.12వ శతాబ్దంలోనే సామాజిక సంస్కరణలకు పునాది వేసిన గొప్ప అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరుడని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలన్న సమున్నత లక్ష్యంతో రెండు సంవత్సరాల క్రితం 30 లక్షల రూపాయల సొంత నిధులతో బీరంగూడ చౌరస్తాలో మహాత్మా బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. హాజరైన వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు.