|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 04:16 PM
మాదకద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి రవాణపై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కేటుగాళ్లు ఏదో ఒక మార్గంలో రాష్ర్టంలోకి వాటిని తీసుకువస్తున్నారు.కాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశాల నుంచి బంగారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టబడిన సందర్భాలుండగా తాజాగా గంజాయి పట్టుపడటం కలకలం రేపింది.విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణీకుడు ఓజీ కుష్ అనే గంజాయిని 24 బ్యాగుల్లో తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని కస్టమ్ అధికారులు తెలిపారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారీగా గంజాయి పట్టుబడటంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.