|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 10:33 AM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇటీవలే చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందర్నీ కలిచివేసింది. కంకర లోడుతో వెళ్తున్న ఓ లారీ… ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 19 మంది మరణించారు. ఇదిలా ఉండగానే…. తాజాగా చేవెళ్ల పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.