|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:13 AM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 3వ వార్డు అభ్యర్థి నవీన్ రెడ్డి, 9వ వార్డు అభ్యర్థి మౌనిక రెడ్డి, 18వ వార్డు అభ్యర్థి గోవర్ధన్ గౌడ్, 19వ వార్డు అభ్యర్థి వరలక్ష్మి గార్లకు మద్దతుగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్, మున్సిపాలిటీ కోఆర్డినేటర్ జైపాల్ గార్లు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.