బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:48 AM
TG: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల సందర్భంగా కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. కొడంగల్ జెడ్పీ హైస్కూల్లోని 6వ వార్డ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.అటు మధిర మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేశారు.మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2,569 వార్డులు, 412 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.