by Suryaa Desk | Sat, Aug 10, 2024, 08:01 PM
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపుర్కు చెందిన పల్లె లావణ్య పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. నొప్పులు ఎక్కువవుతున్నాయని వైద్యులకు, సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని లావణ్య భర్త ప్రదీప్ ఆరోపించాడు. సాధారణ ప్రసవం అవుతుందని వైద్యులు మభ్యపెట్టి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేసి, ఆడ శిశువును తమ చేతిలో పెట్టారని, అప్పటికే శిశువు మృతి చెందిందని బంధువులు వాపోయారు. తాము వచ్చినప్పుడే లావణ్యకు శస్త్ర చికిత్స చేస్తే శిశువు బతికేదని, ఆలస్యం చేయడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపించారు.వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళనకు దిగారు