by Suryaa Desk | Sun, Sep 22, 2024, 10:06 AM
కత్తి కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రులు 15రోజులు పూజలు అందుకున్న గణనాదున్ని అంగరంగ వైభవంగా నిమజ్జనానికి తరలించారు.డప్పు చప్పుల్లు,కళాకారుల నృత్యలు,ఆటపాటలతో దుబ్బాక పురవిధులగుందా గుండా తిరిగి వెళ్లి రా గణపయ్య అంటూ దుబ్బాకలోని పెద్ద చెరువులో ఆనందంగా నిమజ్జనం చేశారు.ఈ నిమజ్జనానికి 30మంది అఘోరాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఈ సందర్బంగా కత్తి కార్తీక మాట్లాడుతూ ప్రతి యేటా వినాయక విగ్రహాన్ని నెలకొల్పి, నవరాత్రులు అన్నదానం పెట్టడం ఆనందంగా ఉందన్నారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం కోసం అ దేవుని దయతో అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన అందుబాటులో ఉంటానని తెలిపారు.ప్రజల ఆశీస్సులు, ఆకాంక్షలతో కత్తి కార్తీక తోబుట్టువు ద్వారా అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు బేబీ కిట్ మరియు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మా ఇంటి మహాలక్ష్మితో కార్తీక అక్క శ్రీమంతం కానుకను అందజేస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు, గణపయ్య ఆశీస్సులతో మరిన్ని నియోజకవర్గం లో మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.