by Suryaa Desk | Sun, Sep 22, 2024, 06:50 PM
ప్రజా బాంధవుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావని కాంగ్రెస్ నాయకుడు అయిల్ల విజయ్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో ఎమ్మెల్యే జన్మదినం సందర్బంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కొక్కిరాల రఘుపతి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేశారన్నారు. ఎమ్మెల్యే పీఎస్ఆర్ జన్మదినం సందర్బంగా పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, జిల్లా అధికార ప్రతినిధి బియ్యల తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలా రాజు, కౌన్సిలర్ రాందేని వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్, యూత్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, బొప్పూ సుమన్, బోడ రాజు, రమేష్, హాజీ, బుద్దె శ్రీనివాస్ (దేవా), శ్రీధర్, విజయ్, రాజేష్, మోత్కూరి వెంకట స్వామి గౌడ్, ఉత్తూరి రవీందర్, నడిమెట్ల రాజన్న, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, దాసరి రవి, చిట్టిమల్ల దిలీప్, దుంపల సోను, శనిగారిపు సంతోష్, శనిగరపు దినేష్ పాల్గొన్నారు.