by Suryaa Desk | Fri, Sep 20, 2024, 02:30 PM
విద్యార్థులు అటు చదువులో ఇటు క్రీడల్లో రాణించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని తిగుల్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎస్జీఎఫ్ ఆద్వర్యంలో మండల స్థాయి క్రీడల పోటీలు ప్రారంభించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఎగరేసి జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడ పోటీలో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని చెప్పారు. అటు విద్యల రాణిస్తూ ఇటు క్రీడల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.
అండర్- 14, అండర్ 17 బాలబాలికలకు క్రీడలు నిర్వహించారు. మొదటిరోజు బాలురలకు క్రీడలు పోటీలు నిర్వహించారు. శుక్రవారం బాలికలకు క్రీడలు నిర్వహించి ప్రతిభ చాడిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, పీఏసిఎస్ డైరెక్టర్ భూమయ్య, మండల నోడల్ అధికారి మాధవరెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సైదులు, కనకయ్య, అనసూయ, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, టి పి టి ఎఫ్ అధ్యక్షులు సత్తయ్య, యుటిఎఫ్ అధ్యక్షులు రాజనర్సయ్య, పీఈటీలు ఎల్లేశ్వర్ రావు, రాజిరెడ్డి, నరేష్, చారి, కవిత, మాజీ ప్రజాప్రతినిధులు దయానంద్ రెడ్డి, బిక్షపతి, బాలకృష్ణరెడ్డి, రాజేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.