by Suryaa Desk | Sun, Sep 22, 2024, 10:48 AM
మహబూబాబాద్ జిల్లా, శనివారం రోజున గూడూరు మండల కేంద్రంలో, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ లెనిన్ వత్సల్ టోప్పో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సమీక్షించి, ప్రభుత్వ దావాఖానలోని వసతుల గురించి, పనిచేసే డాక్టర్లు, సిబ్బంది వివరాల గురించి ఆరా తీశారు. అదేవిధంగా సీజన్ వ్యాధులు ప్రబలుతున్న ఈ సమయంలో, రోగులకు అందుబాటులో ఉండి సరైన వైద్యం చేయాలన్నారు. ఇడ్లీగల్ అపార్షన్స్ లను అరికట్టాలన్నారు.
తదానంతరం బీసీ బాయ్స్ హాస్టల్, ఎస్సీ గర్ల్స్ హాస్టల్, వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మాణం లను పరిశీలించారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో ఎర్ర వీరస్వామి, ఎంపీవో అడ్డగట్ల సత్యనారాయణ, డాక్టర్లు, సిబ్బంది, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.