by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:24 PM
సిడ్నీలో జరిగిన కామన్ వెల్త్ సమావేశంలో భారత్ ప్రతినిధిగా పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.మహిళా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఆ సమస్యలు పరిష్కారంపై చర్చ సాగిందని అన్నారు. కామన్వెల్త్ కాన్ఫరెన్స్‌లో చాలా అంశాలపై చర్చించామని తెలిపారు. దురాచారాలు, వేధింపులు మహిళలపై ఎక్కువఅవుతున్నాయని చెప్పారు.సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌లపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్‌లు నిర్వహిస్తామని వివరించారు. ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైం కింద కేసులు పెడతామని హెచ్చరించారు. సిడ్నీలో జరిగిన కాన్ఫరెన్స్‌లో తనను మహిళా ఎంపీగా వారికి ఛైర్మన్‌గా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనను పంపారని తెలిపారు. అన్ని సమావేశాల్లో పాల్గొని అనేక అంశాలపై చర్చ చేసినట్లు చెప్పారు. ఏపీ స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు కూడా సమావేశాలకు హాజరయ్యారని అన్నారు. తన మీద ఉంచిన బాధ్యతకు పూర్తి న్యాయం చేసేలా పని చేస్తానని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.