by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:25 PM
గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ క్రీడా కుసుమాలుగా తయారవుతున్నారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలలకు, గ్రామాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోదాడ ఎమ్మెల్యే నల మాద పద్మావతి రెడ్డి అన్నారు.నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాదారు.ముందుగా పాఠశాలలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల మార్చి ఫాస్ట్ ను స్వీకరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే, బిఆర్ అంబేద్కర్, ఎస్ ఆర్ శంకరన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.క్రీడల జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహము కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా గురుకుల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో మంచి ప్రతిభను కనపరుస్తున్నారన్నారు. నాలుగు రోజులపాటు జరిగే స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులు వివిధ ఆటల్లో ప్రతిభను చాటి పాఠశాలలకు మంచి పేరు తేవాలన్నారు. నడిగూడెం గురుకుల పాఠశాలకు కావలసిన సౌకర్యాలు అన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. నడిగూడెంలో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని ఈ మేరకు తన వంతు కృషి చేస్తానన్నారు. పాఠశాల 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నందున రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించవచ్చున్నారుఈ మేరకు గురుకుల విద్యాసంస్థల సొసైటీ అధికారులతో మాట్లాడుతానన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అన్నారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల నుంచి 9 పాఠశాలల నుండి టీములు స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనేందుకు రావడంతో వారిని ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు.765 మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు రావడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే తిలకించారు. విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సన్మానించారు.
ప్రిన్సిపాల్ సిహెచ్ వాణి పాఠశాల నివేదిక చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూత్కూరు వెంకటరెడ్డి, డి సి ఓ విద్యాసాగర్, ప్రిన్సిపాల్స్ పద్మ, వెంకటేశ్వర్లు, అరుణకుమారి, విజయలక్ష్మి, ఎంఈఓ ఉపేందర్ రావు మాజీ జడ్పిటిసి బాణాల కవిత, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బాణాల నాగరాజు,సింగిల్ విండో చైర్మన్ గోసుల రాజేష్,మాజీ చైర్మన్ పుట్టా రమేష్ నాయకులు పుల్లారెడ్డి,నరసయ్య,వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, మునగాల ప్రిన్సిపల్ ఝాన్సీ,మాజీ వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు, నాయకులు దున్నా శ్రీనివాస్ విజయరామారావు, శివకృష్ణ,పందిరి వెంకటరెడ్డి చిల్లంచర్ల సత్యనారాయణ గుజ్జ అంజి, అదిమల్ల సురేష్ కుమార్ పల్లపు శ్రీను పాతకోట్ల రాము, మాతంగి మాదవరావు సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.