by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:19 PM
సంగారెడ్డి జిల్లా అందోలు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో సోమవారం 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను అందోలు–జోగిపేట ఆర్డీఓ పాండు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులచే గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆర్డీఓ పాండు మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రీడానైపుణ్యత వెలుగులోకి వస్తుందన్నారు. తమ ప్రతిభ ద్వారా రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికకావాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. క్రీడల్లో క్రీడాకారులు క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలన్నారు.
ఈ పోటీల్లో్ల అందోలు, బట్వారం, చిట్కుల్, ఇస్నాపూర్, రాయికోడ్, ఆర్‌కే పురం, మోమిన్‌పేట్, వికారాబాద్, జహీరాబాద్, కోకట్ గురుకులాలకు చెందిన 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్ అందరిని అకట్టుకున్నాయి. వాలీబాల్, కబడ్డీ క్రీడాకారులను ఆర్డీఓ పాండు, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఐఈఎస్ అధికారి భీమయ్య, తహసీల్దారు విష్ణుసాగర్, ప్రిన్సిపాల్ డాక్టర్ సద్గుణ మేరి గ్రేసీలు క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. క్రీడల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పీడీ గణపతి, పీఈటీ మౌనికతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.