by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:58 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉప రిటర్నింగ్ అధికారి ధోని శ్రీశైలం అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో సోమవారం బిజెపి పార్టీ సమస్త గత ఎన్నికలు నిర్వహణలో భాగంగా ,ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు ఎన్నికల ఇన్చార్జి ఎలుముల మల్లయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధోని శ్రీశైలం మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఈ విషయాన్ని ప్రజలకు వివరించి బిజెపి అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు సైనికుల పనిచేయాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరీష్ బాబు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని దీంతో అభివృద్ధి కొంటుపడుతుందన్నారు. బిజెపి కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం సభ్యత్వ నమోదు ముందుండాలని ప్రతీ కార్యకర్త 100 మందిని సభ్యత్వ నమోదు చేసినట్లయితే క్రియాశీల సభ్యత్వం పొందే అవకాశం ఉంటుందన్నారు.
సభ్యత్వం చేసిన కార్యకర్తలకు పార్టీలో గౌరవం పదవులు దక్కే అవకాశం ఉంటుందన్నారు. పార్టీకి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు చేయాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. బెజ్జూర్ మండలంలో లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల ఇన్చార్జి ఎలుముల మల్లయ్య ,మాజీ జెడ్పిటిసి సభ్యులు పాల్వాయి సుధాకర్, రావు ,మాజీ ఎంపీపీలు కొప్పుల శంకర్ ,కొండ్ర నోహర్ గౌడ్ ,మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.