by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:54 PM
వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి లాగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ నాయక్, కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఒక డిఎస్పి పై తీవ్రంగా దాడి చేశారని ఆయన తెలిపారు. భోగముని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ గారిని నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ పై ఇతర అధికారులపై దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ దాడిలో సుమారు 100కు పైగా వ్యక్తులు ఉన్నారని పోలీసు విచారణ చేస్తున్నామని దానికి పాల్పడిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించమని చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడికి ఎంతటికి సురేష్ మరి అతని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకుంటామని ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని మిగతా వారికి స్వల్ప గాయాలు అయినట్లు పేర్కొన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి కి బలమైన గాయాలు అయ్యాయని కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనపై దాడి చేశారన్నారు.
దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్థుల అభిప్రాయ సేకరణ కు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్ళతో రైతుల దాడి చేశారు.
దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్, అధికారుల పైన ఇలాంటి దాడులు జరగడం విచారకరమని దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించమని త్వరలోనే అందర్నీ అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.