by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:07 PM
బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మంతిని రఘువీర ప్రసాద్, గుంపుల ఓదెలు చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లా మహిళా విభాగం తోటం శాంతి అధ్యక్షురాలు గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ సంఘం లో ఏలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, బీసీ సంక్షేమ మహిళలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
నా నియామకానికి సహకరించిన తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పల్లపు నిలవతి, జిల్లా అధ్యక్షురాలు రమ్య యాదవ్ జిల్లా ఉపాధ్యక్షురాలు స్వరూప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల కళావతి కి కృతజ్ఞతలు తెలిపారు.బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోవటం శాంతి రాష్ట్ర అధ్యక్షుడు మంతిని రఘు నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఆమె ఈ బాధ్యత సక్రమంగా నెరవేర్చుతుంది అన్న నమ్మకంతో ఈ నియామక పత్రానికి కృషిచేసిన వారు గుంపుల ఓదెలు యాదవ్ ,అనుముల కళావతి, రమ్య యాదవ్, పాలడుగుల కనకన్న, చిన్న నారాయణ, పున్నం రాజేశ్వరి ,నూనె లతా మరియు మోహన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.