by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:33 PM
దామెర మండలం ఒగ్లాపూర్ ఎస్బిఐటిలో నందు గల మైనారిటీ పాఠశాల మరియు కళాశాలలో అబుకలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరంచుకుని జాతీయ విద్యాదినోత్సవం మైనారిటీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల శాసనభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భారత పౌరులని విద్యార్థులందరూ మహనీయుడైనటువంటి అబుల్ కలాం ఆజాద్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని,మొదటి విద్యా శాఖమంత్రిగా వారు చేసిన సేవల్ని మరిచిపోకుండా స్ఫూర్తిని తీసుకొని జీవితంలో ఎదగాలని తెలిపారు.ముస్లిం సమాజం నుండి అబ్దుల్ కలాం ఆజాద్ గారు దేశానికి చాలా సేవలు చేశారని,పిల్లలు కూడా ఆ స్థాయిలో ఎదగాలని,తల్లి దండ్రులను,పెద్దలను,గురువుల ను గౌరవించాలని చదువుతో పాటు ఆటపాటలతో రాణించాలని కోరారు,పాఠశాల చక్కగా నడుస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో డైట్ & కాస్మోటిక్ చార్జీలను పెంపు చేసిందని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహానాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు,మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం,ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైలని బాబా దర్గా పీఠాధిపతి, జనాబ్ సైలని బాబ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ లాల్ హట్కర్ తదితరులు పాల్గొన్నారు.