by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:40 PM
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ...కార్యకర్తలు నిజాయితీగా పార్టీ కోసం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని,ఏదో ఒక అసంతృప్తి, ఏదో కోల్పోయాం అనే భావం నాయకుల్లో కార్యకర్తలలో ఉందని ఆనాడు ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా గులాబీ జెండా, కేసీఆర్ మాటలకూ గౌరవం ఉన్నదని దేశ రాజకీయాల్లోనే ఒక ప్రభలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని అరుదైన ఖ్యాతి గౌరవం బీఆర్ఎస్ సొంతం.స్వలాభం కోసం వచ్చిన వారే, పార్టీ విడిచి పోయారని వారికోసం బాధపడే అవసరం లేదన్నారు..బీఆర్ఎస్ పార్టీలో లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అని కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.నిజాయితీతో నిబద్ధతతో పార్టీ కోసం కష్టపడేవారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఉంటాయన్నారు..రానున్న రోజులు బిఆర్ఎస్ పార్టీవే అని గుర్తు చేశారు.14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం లో తర్వాత రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చికా 60 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ ప్రాంతంలో రైతాంగం కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కావచ్చు ఏ సమస్యల తోటైతే సతమతమైన వాటిపైననే దృష్టి సావించి, వేచి చేయకుండా ప్రధానమైనటువంటి సమస్యల పైన దృష్టి సాదించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ ని గుర్తు చేశారు.ఆనాడు మనకు సాగునీళ్ళు లేక తాగు నీళ్ళు లేక కరెంటు లేక మౌలిక వసతులు లేక అన్నీ ఉండి కూడా వెనుక బడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిపారు..కాంగ్రెస్ పార్టీ అబద్దాల తో గద్దెనెక్కింది.ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి భాష ప్రవర్తన పద్ధతి ప్రజలు గమనిస్తున్నారు.
తెలంగాణ ప్రజా పరిపాలన నడుస్తు లేదు.. దోపిడీ పరిపాలన నడుస్తోందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ జెడ్పీటీసీ గంట రాములు, మాజీ ఎంపీపీలు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ బాలాజీ రావు, పెద్దపల్లి మాజీ ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, ఎలిగేడు మాజీ ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, పెద్దపల్లి మండల అధ్యక్షులు మార్కు లక్ష్మణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.