by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:17 PM
మహబూబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో, మహబూబాబాద్ శాసన సభ్యులు డాక్టర్ మురళి నాయక్ ఆదేశాల మేరకు, గూడూరు వడ్డెర గూడెం కి చెందిన సూర వెంకన్న, చంద్రుగూడెం కి చెందిన, దుర్గాల పావని లకు సుమారు 50 వేల రూపాయల, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్, గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డిలు అందజేశారు.
వారితో పాటు గూడూరు కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు రాసమల్ల యాకయ్య, మహబూబాబాద్ జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఎండి. రసూల్, గూడూరు మండల కార్యదర్శి సూర గంగయ్య, గూడూరు టౌన్ కార్యదర్శి సూర శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాసమల్ల రాములు, రూపురెడ్డి వెంకటరెడ్డి, దొడ్డ వెంకటరెడ్డి, సూర గంగయ్య, సూర శ్రీను, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లెపు నాగరాజు, జీలుగుల వెంకన్న, హుస్సేన్, మండల సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.