by Suryaa Desk | Sun, Sep 22, 2024, 11:49 AM
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో రైతు వేదికలు ప్రారంభించారు. 2020లో మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒకచోట ఏర్పాటు చేశారు. దుబ్బాక మండల వ్యాప్తంగా మొత్తం 10రైతు వేదికలను నిర్మించారు. ఒక్కోదానికి రూ.20నుంచి 25లక్షలకుపైగా వెచ్చించారు. ప్రస్తుతం వీటి నిర్వహణ ఆర్థికంగా భారమవుతోంది. రెండేళ్ల నుంచి నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏఈవోలు ఈ వేదికల్లో అందుబాటులో ఉండి పంటల సాగులో ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడమేగాక రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల అమలు, వాటిపై దరఖాస్తుల స్వీకరణ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రతి మంగళవారం రైతు నేస్తం, శుక్రవారం రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఇంత వరకు బాగానే ఉండగా నిర్వహణకు నిధులు రాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి.
రైతు వేదిక నిర్వహణ ఖర్చుల కింద ప్రతి నెల రూ.9 వేలు ఇస్తారు. వీటిని విద్యుత్తు ఛార్జీలు, తాగునీరు, గదులను శుభ్రం చేయడం, స్టేషనరీ, జిరాక్స్, శానిటరీ, మినీ లైబ్రరీ, చిన్న చిన్న మరమ్మతులు, రైతు శిక్షణలకు వినియోగించాలి. ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడమేగాక రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల అమలు, వాటిపై దరఖాస్తుల స్వీకరణ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రతి మంగళవారం రైతు నేస్తం, శుక్రవారం రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఇంత వరకు బాగానే ఉ ండగా నిర్వహణకు నిధులు రాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. 2022 తర్వాత నిధుల విడుదల ఆగిపోయయి . 15 నెలల నుంచి ఇవ్వకాపోవడంతో ఏఈవోలు ఇబ్బందులు పడుతున్నారు. తమ జేబుల్లో నుంచే వెచ్చిస్తున్నారు. వాటిని విడుదల చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏఈవోలు కోరుతున్నారు.