by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:02 PM
తెలంగాణ రాష్ట్రం లో రైతులు 54 లక్షల పై చిలుకు ఎకరాలలోపత్తి సాగుచేస్తున్నారు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో దాదాపు 50 శాతం పత్తి పంట తీసివేస్తున్నారు. పత్తి పంట ఎర్ర బడడం, ఎదగక పోవడం, దిగుబడి మొత్తం పడిపోవడం జరిగింది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 70 శాతం పత్తి పంట దెబ్బతిన్నది ప్రకృతి వైపరీత్యాల చట్టం , పత్తి రైతులకు వర్తిస్తుందని బిఆర్ఎస్ పార్టీ తరుపున గతంలోని ప్రకటన చేసినాం
స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ముల నాగేశ్వర్ రావు గారికి లేఖ కూడా గతంలో లేఖ రాసినం కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ, జిల్లా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎక్కడ కూడా పత్తి రైతుల సమస్య మీద సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం దుర్మార్గం ఇవాళ మొత్తం రాష్ట్రంలో పాడి తరువాత పత్తి పంట రెండో ప్రాధాన్యత గల ఎక్కువ విస్తర్ణం పంట లక్షలాది మంది రైతులు పత్తి పంట మీద పెట్టుబడి పెట్టి దీవల తీశారు
* వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 8 నుండి 9 క్వింటలా దిగుబడి రావాలే కానీ 3 క్వింటాలు దాటడం లేదు
* ఈరోజు పత్తి పంట వదిలేసి మొక్కజొన్న పంట వేసుకునే పరిస్తితి గ్రామాల్లో కనిపిస్తుంది
* సిసిఐ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్రంలో పత్తి కొనుగోలు చేయము అని రాష్ట్ర కాటాన్ మరియు మిల్లర్లు ట్రేడ్ యూనియన్ వాళ్లు చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు
* అకాల వర్షలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గింది ఎకరాకు ఒకటి నుంచి మూడు క్వింటాల్ కూడా దాటడం లేదు ఈ తరుణంలో పండించిన రైతు వద్ద నుండి సిసిఐ పత్తి కొనుగోలు చేయకపోవడం రైతులను తీవ్ర ఇబ్బంది పెట్టడమే.
* పత్తి రైతుకు సరైన దిగుబడి రాక పండిన పంటను సీసీఐ అనేక నిబంధనలను విధించి కొనుగోలుచేయడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన రైతులు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు . సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పత్తి పంట కొనుగోలు చేయక పోవడం వలన ప్రైవేటు వ్యాపారస్తులు, దళారులు తక్కువ ధరకు 5 వేల నుండి 6 వేలకు కొంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులుపండించిన అన్ని పంటలకు బోనస్ చెల్లిస్తానని చెప్పి ఈరోజు పత్తి పంటకు బోనస్ ఎగవేయడం జరిగింది రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు ,రుణమాఫీని పూర్తిగా చేయలేదు, రైతు పండించిన పంటలకు బోనస్ ఇవ్వలేదు కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వలేదు రైతు కూలీలకు సంవత్సరానికి 12000 ఇవ్వలేదు,రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కుడా నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని భవిష్యత్తు లో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పత్రికా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదు.వ్యవసాయ అధికారులు గెలిచిన ప్రజాప్రతినిధులు మొద్దు నిద్రలో ఉన్నారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు అని టిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నారు