by Suryaa Desk | Tue, Nov 12, 2024, 02:54 PM
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కులగణన కార్యక్రమాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు రెండవ వార్డులోని బ్లాక్ నంబర్ 15,16 ఎమ్యనేటర్లు వార్డ్ ఆఫీసర్ రవి సార్, బి ఎల్ ఓ కే. పూర్ణిమలు నిర్వహిస్తున్నటువంటి సర్వేను పర్యవేక్షించి కుటుంబ సభ్యులను ఎలా ఆధారాలు సేకరిస్తున్నారని ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చారిత్రాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కులగణన అనేది మన రాష్ట్రంలో ప్రారంభమైందని కుల గణన అనేది బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, మన ఏఐసిసి నాయకులు శ్రీ రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో కులగణనపై హామీ ఇచ్చారు. కులగణను చేపట్టి ఆయా కులాల జనాభాను బట్టి రిజర్వేషన్లు కూడా పెట్టి సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని కచ్చితంగా హామీ ఇచ్చారని కుల గణాన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో కేబినెట్ నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టినందున దీనిని ప్రజలందరూ స్వాగతించి సహకరించాలని, దీనిని బట్టి ఈ సర్వే బడుగు, బలహీన వర్గాల బాగు కోసం కృషి చేస్తున్న ఈ సర్వే కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.