by Suryaa Desk | Tue, Nov 12, 2024, 02:36 PM
క్రీడారంగంలో నారాయణఖేడ్ కి దేశస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.సోమవారం మండల పరిధిలోని జుక్కల్ శివారులోని సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ లో మీట్ అండర్ 14, అండర్ 17, అండర్ 19,బాయ్స్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చరిత్రలో ఎన్నడు లేనివిధంగా 364 కోట్ల రూపాయలు నిధులను క్రీడా శాఖకు కేటాయించారని జిల్లాకు స్పోర్ట్ యూనివర్సిటీ నియోజకవర్గం లో ఇండోర్ స్టేడియం నెలకొల్పాలని ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు.త్వరలో గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ నిర్వహించబోతున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిలో ప్రతిభ దాగి ఉంటుందని దానిని ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్స హించినపుడే వారు మంచిస్థాయికి వెళ్తారన్నారు.
గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు.తెలంగాణ నుండి ఒలంపిక్స్ వంటి పోటీలకు క్రీడాకారులు ఎంపిక కావాలంటే గ్రామ స్థాయిలోనే టాలెంట్ గుర్తించడం అవసరమని పేర్కొన్నారు. సీఎం కప్ పోటీల ద్వారా గ్రామ మండల జిల్లా స్థాయిలో మంచి నైపుణ్యత పొందిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో అంతరాష్ట్రస్థాయిలో ఒలంపిక్స్ లో వెళ్లే విధంగా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడల్లో రాణిస్తే సర్టిఫికెట్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తుందన్నార.విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆనందాన్ని ఇస్తాయన్నారు. క్రీడాకారులు గెలుపోటములు హుందాగా స్వీకరించాలని అన్నారు. ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులకు ఏలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి నిర్వాహకులకు క్రీడ పోటీలను విజయవంతంగా నిర్వహించాలని అధ్యాపకులకు కోచ్ ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ , నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శేట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, రమేష్ చౌహాన్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.