by Suryaa Desk | Mon, Nov 11, 2024, 10:48 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి సమగ్ర కుల గణన సర్వేను పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బీ. మహేష్ కుమార్ గౌడ్( పార్టీ శ్రేణులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. నవంబర్ 6వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైందని, ఈ నెల 26వరకు కొనసాగనుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల మంచి కోసం చేపట్టిన ఈ సర్వే కార్యక్రమంలో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆదేశించారు. అలాగే పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో కనెక్ట్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, రోజువారిగా పార్టీ కార్యకర్తలకు ఈ సెంటర్ నుండి ఫోన్ ద్వారా కేడర్ తో మాట్లాడటం జరుగుతుందని, సర్వే నిర్వహణలో కార్యకర్తలకు ఏమైనా సందేహాలుంటే కనెక్ట్ సెంటర్ తో మాట్లాడవచ్చని తెలిపారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసి, జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పిస్తామని హమీ ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ గాంధీయన్ నాలెడ్జ్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు, ప్రభుత్వానికి కుల గణన, సామాజిక న్యాయంపై దిశా నిర్ధేశం చేశారని గుర్తు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కుల గణన మరియు సమగ్ర ఇంటింటి సర్వే గురించి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.#TelanganaCasteCensus pic.twitter.com/Mb9E1XJqqM
— Telangana Congress (@INCTelangana) November 11, 2024