by Suryaa Desk | Mon, Nov 11, 2024, 10:18 AM
రాష్ట్రంలో దగా పాలనకు ఏడాది పూర్తవుతోందని, రైతుంధు ఎగ్గొట్టడమే కాకుండా.. పెట్టుబడి సాయాన్ని కూడా ఇవ్వకపోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.నేడు (సోమవారం) నాడు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఈ పోస్ట్ చేశారు. తన పోస్ట్‌లో కేటీఆర్..''నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట ? దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? కాంగ్రెస్ పాలనలో.. ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా? రేవంత్ ఏడాది ఏలికలో…తెలంగాణ రైతుకు గోస తప్ప.. భరోసా లేనే లేదు. వానాకాలం పెట్టుబడి సాయానికి మోక్షం లేదు. యాసంగి రైతుభరోసాకు దారే కనిపించడం లేదు. 2 లక్షల రుణమాఫీ పేరిట దగాచేశారు..ఇక రైతుబంధును కూడా ఎత్తేస్తారా? ఇలాగైతే తెలంగాణలో సాగు సాగేదెలా..? ఏడాదిలోనే బక్కచిక్కిన రైతు బతికేదెలా..?? సిగ్గు లేని కాంగ్రెస్ పార్టీ..చేతకాని హామీలు ఇవ్వడమెందుకు? అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకు? అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతను ఆగం చేశారు. సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని సంక్షోభంగా మార్చారు. మరోసారి ఎవరేంటో తేలిపోయింది. బీఆర్ఎస్ నినాదం.. విధానం.. జై కిసాన్జ కాంగ్రెస్ పాలసీ ఎప్పటికీ.. నై కిసానే'' అంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు
నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట ?
దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ?
కాంగ్రెస్ పాలనలో.. ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా ?
రేవంత్ ఏడాది ఏలికలో…తెలంగాణ రైతుకు గోస తప్ప..… pic.twitter.com/DSJjHCMWXv
— KTR (@KTRBRS) November 11, 2024