by Suryaa Desk | Tue, Nov 12, 2024, 01:54 PM
సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి పదవులు పోవడం ఖాయమని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'అధికార దుర్వినియోగం చేసిన సోనియాతో సహా చాలా మంది పదవులు కోల్పోయారు. మేము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు భయం ఎందుకు?. తెలంగాణలో వసూళ్లు, బెదిరింపులు పెరిగాయి. RR ట్యాక్స్ ఉందని ప్రధాని మోడీనే చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు' అని అన్నారు.ప్రధానమంత్రి తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడడం కాదని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్ఆర్ టాక్స్ సంబంధించి ఆరోపణలు చేయడం కాదని, వెంటనే తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా తెలంగాణ అమృత్ టెండర్లలో జరుగుతున్న అవినీతిపైన ఫిర్యాదు చేసిన తర్వాత ప్రధానమంత్రి స్పందిస్తారో లేదో చూడాలన్నారు.