by Suryaa Desk | Sun, Sep 22, 2024, 11:53 AM
ఆత్మకూరు మండల కేంద్రంలో మండల పద్మశాలి భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి వేడుకలు మండల పద్మశాలి అధ్యక్షులు వెల్దే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ తోలితరం ఉద్యమకారులు, మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో రాజీపడకుండా హైదరాబాదు నడి ఒడ్డున జలదృశ్యంలోని తన సొంత భూమిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనె ఆశయంగా పోరాటంలో ప్రజలందరి నిలువ నీడ కోసం తృణప్రాయంగా ఇచ్చిన తెలంగాణ పోరాట యోధుడు,మూడు తరాల ఉద్యమ నాయకుడు తెలంగాణే శ్వాసగా తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి 90 ఎళ్ల వయసులో జoతర్ మంతర్ వద్ద ఎముకలు కొరికే చలిలో దీక్ష చేసిన గొప్ప తెలంగాణ వాది అని అలాంటి వారి ఆశయాల అనుగుణంగా ప్రజలందరం చైతన్య పరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ ఇరసడ్ల సదానందం,మండల ఉపాధ్యక్షులు బలబద్ర కిషోర్,పాపని రవీందర్,మండల కోశాధికారి వడ్డేపల్లి ప్రసాద్, ఆత్మకూరు గ్రామ పద్మశాలి అధ్యక్షులు వడ్డేపల్లి వేణు, గ్రామ ప్రధాన కార్యదర్శి మార్త కేదారి, పద్మశాలి యూత్ అధ్యక్షులు మార్త రంజిత్ కుమార్, వెల్దే లక్ష్మణమూర్తి, కొంపల్లి రవి, చిమ్మని బిక్షపతి,చిమ్మని బిక్షపతి,వెల్డే సదానందం,జాగిలపు శ్రవణ్ కుమార్,వెల్దే సుదర్శన్,మాచర్ల రవితేజ,మాచర్ల సదానందం, వంగరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.