by Suryaa Desk | Fri, Sep 20, 2024, 08:34 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతంరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గత రికార్డుల ప్రకారం ఎఫ్‌టీఎల్ పరిధి కేవలం 65 ఎకరాలుగా మాత్రమే ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అయితే, ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ, నీటిపారుదలశాఖలతో పాటు హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని వివిధ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.