by Suryaa Desk | Thu, Sep 19, 2024, 08:49 PM
వరద బాధితుల సహాయార్థం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2.50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గార్లను కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా సహాయం అందించినందుకు ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు.