by Suryaa Desk | Tue, Nov 19, 2024, 09:53 AM
గౌరవెల్లి ప్రాజెక్టు కింద కాలువ నిర్మాణ పనులకు భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వానికి సహకరించాలని హుస్నాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మూర్తి కోరారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్ క్రింద భూమి కోల్పోతున్న (ముంపునకు) గురవుతున్న రైతులతో మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ ఏర్పాటు చేసి మాట్లాడారు కాలువ నిర్మాణానికి 14 కిలోమీటర్ల పొడవుతో 48 ఎకరాల 16 గుంటల భూమి అవసరం ఉందని ఈ భూమి సర్వే అధికారులు నేటి నుండే సర్వే చేపడతారని తెలిపారు. ఇందులో బావులు, బోరు బావులు చెట్లు, తదితర వాటికీ ప్రత్యేక పరిహారం అందిస్తామన్నారు. ప్రాజెక్టు ముంపు బాధితులకు ఎలాగైతే పరిహారం అందిందో అదే విధంగా కాల్వ ద్వారా భూమి కోల్పోయిన రైతులకు ఇప్పటి మార్కెట్ రేటు విలువకు మూడింతలు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే రైతుల నుండి సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు. మరో రెండు లేదా మూడుసార్లు గ్రామ సభ్యులు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్న ఆఫీసులో కానీ నేరుగా కానీ కలవవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఈఈ రమేష్ మాట్లాడుతూ కాలువ నిర్మాణం తో కోహెడ మండలానికి 12,490 ఎకరాలకు నీరందుతుందని అందులో కోహెడ గ్రామానికి 3300 ఎకరాలు నీరందుతుందన్నారు. కాగా రైతులందరూ కాలువ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ తహసిల్దార్ కే సురేఖ, డిఈ రేష్మ, ఇంచార్జ్ ఎంపీఓ శోభ, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్సై అభిలాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేందర్, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద ధర్మయ్య, నాయకులు భీమ్ రెడ్డి తిరుపతిరెడ్డి బందెల బాలకిషన్ వేల్పుల వెంకటస్వామి,జగన్ రెడ్డి, భీమ్ రెడ్డి మల్లారెడ్డి రైతులు, తదితరులు పాల్గొన్నారు.