by Suryaa Desk | Tue, Nov 19, 2024, 12:02 PM
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వచ్చునూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు ఎస్సారెస్పీలో మునిగిపోయిన ఈదుల చెరువును కబ్జా చేసి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వాడుకుంటున్నారని గ్రామానికి చెందిన ఉప్పులేటి రాజు, వడ్లకొండ శివశంకరయ్య, ఉప్పులేటి సతీష్, అంజయ్య ప్రజావాణిలో జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు.
చెరువుకట్ట ఎత్తును పెంచడమే కాకుండా మత్తడిని పెంచి రైతులు పొలాలకు వెళ్లే వీలు లేకుండా చేశారనీ, అంతేకాకుండా చెరువు ద్వారా వచ్చే రెవెన్యూను సైతం వారే వాడుకుంటున్నారని వినతిలో పేర్కొన్నారు. ఎస్సారెస్పీలోని చెరువును కబ్జా చేసి, వేలం వేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.