by Suryaa Desk | Tue, Nov 19, 2024, 10:41 AM
ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన ఏడాదైన సందర్భంగా మంగళవారం శిల్పారామంలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
సంక్షేమ పథకాలపై రూపొందించిన సంగీత నాటకాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.