by Suryaa Desk | Tue, Nov 19, 2024, 12:35 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీబద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అమ్మవారికి ఇష్టమైన మంగళవారం బోనాలు, పసుపు కుంకుమలు సమర్పించుకునేందుకు మహిళా భక్తులు బారులు తీరారు. అందర్నీ చల్లంగా చూడు తల్లి అంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల మొక్కులు అమ్మవారికి సమర్పించడం ప్రధాన మొక్కుగా ఉందని భక్తులు చెబుతున్నారు.