by Suryaa Desk | Mon, Nov 18, 2024, 10:05 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో ఎం సి పి ఐ (యు) పార్టీ ముఖ్యుల సమావేశంలో, పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా, లగచర్లలో భూసేకరణ పై నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అధికారులకు, భూములు కోల్పోయిన రైతుల మధ్య జరిగిన సంఘటన, రాజకీయ కోణంగా చూడకుండా, బాధిత రైతుల పక్షాన పోరడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైతులు తమ భూములు కోల్పోతున్నాయని ఆవేదనతో ఆ సంఘటన జరిగిందని, దీనిని అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ పరస్పరం ఆరోపణ చేసుకోవడం సమస్యను పక్కదారి పట్టించడం మేనని, వాస్తవంగా ఫార్మా కంపెనీ కోసం లగచర్ల, పులిచెర్లకుంట, రోటిబండ తండాల్లో భూములను బలవంతంగా లాక్కొని, ఫార్మా కంపెనీ నిర్మించాలనే ఉద్దేశం సరైంది కాదని, మొదటగా రైతులను కూర్చోబెట్టి వారితో మాట్లాడి, వారికి భూమికి బదులు భూమినే కేటాయించి, రైతుల అంగీకారం మేరకే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని, ఎంసిపిఐ (యు) పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ గాధగోని రవి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో, కేవలం ఉచిత బస్సు సౌకర్యం మాత్రమే పూర్తిగా సక్సెస్ అయిందని, మిగతావి అసంపూర్తిగానే అమలు చేశారని, రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా కొత్తగా వివాహాలు జరిగిన జంటలకు, రేషన్ కార్డులు లేక, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోలేని పరిస్థితి ఉందని, అర్హులైన ప్రతి వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నియామకాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, ఈ డబ్ల్యూ ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన 29 జీవో వల్ల, రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువకులకు తీవ్ర అన్యాయం జరిగిందని, జీవో నెంబర్ 29 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎం సిపిఐ( యు) పార్టీ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి నూకల ఉపేందర్ యాదవ్, గూడూరు మండల పార్టీ కార్యదర్శిబందెల వీరస్వామి, జిల్లా నాయకులు కటకం బుచ్చిరామయ్య, తదితరులు పాల్గొన్నారు.