by Suryaa Desk | Mon, Nov 18, 2024, 10:01 PM
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ భవనాన్ని జిల్లా ఎహ్ మ్ స్ బాలికల హాస్టల్ లను జిల్లా నాయకులు పర్యటన చేసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు జె శ్రీను నాయక్, కేవీపీస్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ లు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన గిరిజన సంక్షేమ భవనం, గిరిజన మహిళ కళాశాల కు ప్రభుత్వం వెంటనే వాడుకలోకి తేకుండా పనులు పెండింగ్లో పెట్టి గాలికి వదిలేసిన ప్రభుత్వం అధికారులు గిరిజనులను చిన్నచూపు చూస్తూ ఉంది అన్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు కరువైనవి భవనాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు, వాటర్ సౌకర్యం బోరు లేదు, కరెంటు లేదు,రోడ్డు లేదు, నూతన భవనాలు కట్టి ఓపెన్ చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఎక్కడి పనులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి.
గిరిజన కళాశాల విద్యార్థినిలు ప్రైవేటు భవనాలలో కాలం నివాసి స్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్లుగా వ్యవహరిస్తూ నిర్మాణంలో ఉన్న భవనాలను వాడుకోలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. గిరిజన భవనాన్ని హాస్టల్లను వాడుకోలోకి తీసుకోవాలని గిరిజన సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కు డిమాండ్ చేస్తున్నమూ. లేనిచో విద్యార్థులను గిరిజను లను సమీకరించి,రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ఈ పర్యటన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గిరిజన సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శీను నాయక్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, రాజు నాయక్, బాధ్య నాయక్, శంకర్ మహిపాల్ శ్రీను వాస్ తదితరులు పాల్గొన్నారు.