by Suryaa Desk | Mon, Nov 18, 2024, 09:57 PM
పెద్దపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆటోలో ఆడుకుంటున్న 14 ఏళ్ల గౌస్ బాబా అనే బాలుడు పై అదే కాలనీకి చెందిన చాంద్ పాషా అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పట్టపగలు బాలునిపై దాడి చేస్తుండగా చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించి బాలుడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని తరలించి చికిత్స చేయించారు. దాడికి పాల్పడిన చాంద్ పాషాను అదుపులోకి తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.