by Suryaa Desk | Tue, Nov 19, 2024, 12:15 PM
రానున్న ఎన్నికలలో మెట్ పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేలా కార్యకర్తలు పని చేయాలని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ మెట్ పల్లి పట్టణంలో 7వేల సభ్యత్వాలు చేయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.
సభ్యత్వాలు చేయించడంతోనే ఆగిపోకుండా రానున్న ఎన్నికల్లో మునిసిపాలిటీని దక్కించుకునే విధంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, నాయకులు యాదగిరి బాబు, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, గుంటుక సదాశివ, చెట్లపల్లి మీనా, నవీన్, నగేష్, సత్యనారాయణ గౌడ్, లావణ్య, శ్రీకాంత్, అశోక్, సౌజన్య, రజిని, రాజయ్య, రాజారెడ్డి, లింగేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.