by Suryaa Desk | Tue, Nov 19, 2024, 12:50 PM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకా అయిన హుజుర్నగర్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.చేతివృత్తుల దారులపై మున్సిపల్ అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారు. ఫుట్ ఫాత్ ఆక్రమించారంటూ జేసీబీలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు.తమను రోడ్డుపాలు చేయవద్దని నాయిబ్రాహ్మణుడి ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీకి అడ్డుగా రోడ్డుపై పడుకొని నిరసన తెలిపాడు.. షాప్ కూల్చివేశారని కంటతడి పెట్టుకున్నాడు. కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గోడు వినకుండా ముందుకుపోతున్న మున్సిపల్ అధికారులు..మీకు ఇదే న్యాయమేనా అంటూ ప్రశ్నించాడు ఆ బాధితుడు