by Suryaa Desk | Tue, Nov 19, 2024, 03:53 PM
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. జీవో నెం.16ను కొట్టేసింది హైకోర్టు.ఈ జీవో ద్వారా వేలాది మందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. తాజా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తో రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు . మరోవైపు అధికారులు మాత్రం కోర్టు ఆర్డర్ కాపీ వస్తే కానీ ఓ క్లారిటీ వస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం రెగ్యులరైజ్ అయిన వారి విషయంలో కోర్టు తీర్పులో ఏమి ఉందో చూడాలని అదికారులు అంటున్నారు.