by Suryaa Desk | Tue, Nov 19, 2024, 06:30 PM
ఆరేళ్ల కిందట మతిస్థిమితం కోల్పోయి కుటుంబానికి దూరమైన ఓ వ్యక్తి.ని ఓ అనాథ ఆశ్రయం ఆదుకుని అక్కున చేర్చుకుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతున్న బాలయ్య అనే వ్యక్తిని ఆశ్రమ నిర్వాహకులు తీసుకెళ్లారు. గత నెల అతడి కుమార్తె దివ్య.. మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో అభాగ్యులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి వారికి చెప్పారు. మళ్లీ దివ్య, ఆమె సోదరి లావణ్య అదే ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి సోమవారం రాగా.. అక్కడ ఉన్న 130 మందిలో తన తండ్రి ఉన్నట్టు గుర్తించింది. అతడ్ని గుర్తుపట్టి బాగోద్వేగానికి గురైంది. తండ్రి హత్తుకున్న ఈ దృశ్యాన్ని చూసినవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.