by Suryaa Desk | Tue, Nov 19, 2024, 12:04 PM
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు ఏమీ రాలేదని తహశీల్దార్ హిమబిందు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులుహాజరయ్యారన్నారు. ప్రజలు తమ సమస్యలు ఏవైనా ఉంటే ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు.
అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం తహశీల్దార్ హిమబిందు లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని నాగల్గాం గ్రామానికి చెందిన శేషబాయి, తాటి అనితకు మంజూరైన రూ. లక్ష విలువ గల చెక్కులను అందించారు.ఈ కార్యక్రమం లో ఆర్ ఐ రాం పటేల్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము, వెటర్నరీ డాక్టర్ పండరి, బాబు పటేల్, అనిల్, తదితరులు ఉన్నారు.