by Suryaa Desk | Tue, Nov 19, 2024, 12:07 PM
పేదలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన హమాలీ కార్మికుడు పంబాల రఘు, ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన ఉషనగళ్ళ రాములు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసి వారిని ఓదార్చారు. అలాగే మంతూర్ గ్రామంలో సోమవారం గుండెపోటుతో మృతి చెందిన పడిగ నరసింహులు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అదే గ్రామానికి చెందిన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహమ్మద్ ఖాసిం మృతిచెందగా బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం తాను ఎన్నో సంవత్సరాల నుంచి అండగా ఉంటూ వారికి పలు రకాల ఆర్థిక సాయం అందించడం జరిగిందని గుర్తు చేశారు. పేద రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేశారు. తనతో ఎన్నో సంవత్సరాలుగా సత్సంబంధాలు ఉన్న పలువురు నాయకులు. కార్యకర్తలు అనారోగ్యంతో మీ చెందడం పట్ల చేస్తూ ఆయా కుటుంబాలకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పేదల కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని. పదవి ఉన్న లేకున్నా దుబ్బాక నియోజకవర్గం ప్రజల మధ్యలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పేదలకు సేవ చేయడం ద్వారానే తనకు ఎంతో సంతృప్తి కలుగుతుందని ఎమ్మెల్సీ ఫారక్ హుస్సేన్ పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి. మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ పర్వీజ్ అహ్మద్. బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు సిహెచ్ మంజూరు. బాగిరెడ్డి. మల్లారెడ్డి. తదితరులు ఉన్నారు.