by Suryaa Desk | Tue, Nov 19, 2024, 10:47 AM
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ రెండవ వార్డ్ ఎస్సీ కాలనీలో మంచి నీటి సమస్య ఉందని గ్రహించిన స్థానిక కౌన్సిలర్ గొనేపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని అడుగగానే బోరు కొరకు నిధులు కేటాయించినందున సోమవారం వార్డ్ కౌన్సిలర్ బోరు బండికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డ్ ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా చూడటమే మా బాధ్యతని అన్నారు.